Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-రఘునాథపాలెం
వ్యవసాయానికి అవసరమైన త్రీఫేజ్ విద్యుత్ ఎప్పుడు వస్తుందో సమయం చెప్పకుండా... వ్యవసాయానికి సరైన సమయంలో కరెంటు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టడమే కాక రైతులు అమర్చుకున్న వ్యవసాయ మోటార్ల ఆటో స్టాటర్లను బలవంతంగా రైతు లేని సమయంలో విద్యుత్ అధికారులు తొలగించడం సరైంది కాదని సీపీఎం మండల కార్యదర్శి చేసిన ఎస్.నవీన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ ఆటో స్టాటర్ల బలవంతపు తొలగింపు ప్రక్రియ ఆపాలని మండల అసిస్టెంట్ సబ్ ఇంజనీర్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్.నవీన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్‌గా విద్యుత్ అధికారులు పొలాల్లోకి వెళ్లి రైతు లేని సమయంలో మోటార్ ఆటో స్టాటర్లను మండలంలో అనేక గ్రామాల్లో తొలగిస్తున్నారని వారన్నారు. వ్యవసాయానికి సరైన సమయంలో కరెంటు రావడంలేదన్నారు. వ్యవసాయ బావుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారని తెలిపారు. సరైన సమయంలో కరెంటు ఇవ్వకపోవడంతో రైతుల అయోమయంలో ఉన్నారన్నారు. ఈ గందరగోళం నుంచి రైతులు మోటార్లకు ఆటో స్టాటర్లను ఏర్పాటు చేసుకున్నారని వారు గుర్తు చేశారు. దీనివల్ల కరెంటు వచ్చినప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా ఉందని అన్నారు. గతంలో సమయపాలన లేని కరెంటు ఇవ్వడం వల్ల రాత్రులు నీళ్లు పెట్టుకోవడానికి పొలం దగ్గరికి వెళ్లిన రైతులు అనేక ప్రమాదాలకు గురయ్యే వాళ్ళని గుర్తుచేశారు. మళ్లీ విద్యుత్ అధికారుల వ్యవహార శైలి వల్ల అదే పరిస్థితి పునరావృతం అయ్యేలా ఉందని వారు విమర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వంకాయలపాటి వెంకటేశ్వర్లరావు, కార్యదర్శి వల్లూరు శ్రీనివాసరావు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ ఇమామ్, గిరిజన సంఘం మండల కార్యదర్శి కుమార్, నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు.
సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
కొణిజర్ల : వ్యవసాయ విద్యుత్ మోటార్ల ఆటో స్టాటర్ల తొలగింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కొణిజర్ల మండల కేంద్రం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులు ఉపయోగించడం నేరం అవుతుందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, రైతు సంఘం సినీయర్ నాయకులు కొప్పుల కష్ణయ్య, జిల్లా కమిటీ సభ్యులు చెరకు మల్లి కుటుంబరావు మండల అధ్యక్షులు దారగాని రాములు కార్యదర్శి యర్రమల మాధవరెడ్డి, మోత్కూరి వెంకటేశ్వ రరావు, తాతా వెంకయ్య, చింతనిప్పు నరిసింహారావు, చల్లా నారాయణ, అన్నవరపు వెంకటేశ్వరరావు, జోనబోయిన అంజయ్య, బుర్రి గోపయ్య, జట్లా రవి, దుగిని అజరు, హరిచంద్, మైహిబుఅలీ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.