Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
- రాష్ట్ర బడ్జెట్ ఘనం... నిధుల కేటాయింపు అరకొర
- ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క
నవ తెలంగాణ - బోనకల్
ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అందులో భాగంగానే మహిళలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక నందు మండల పరిధిలోనే వివిధ గ్రామాలకు చెందిన 92 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కలిసి సోమవారం పంపిణీ చేశారు. ఇందులో కళ్యాణ లక్ష్మి చెక్కులు 76 షాదీ ముబారక్ చెక్కులు 16 ఉన్నాయి. ఈ సందర్భంగా ఎంపీపీ కంకణాల సౌభాగ్యం అధ్యక్షతన జరిగిన సభలో కమల్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందజేస్తుందన్నారు.
రాష్ట్ర బడ్జెట్ ఘనం... నిధుల కేటాయింపు అరకొర: ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కానీ సంక్షేమ పథకానికి మాత్రం అరకొర నిధులు కేటాయించారని మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. చెక్కులు పంపిణీ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు తల్లి పథకం పేరుతో మహిళ పెళ్లి వయసు వచ్చేనాటికి 2 లక్షల రూపాయలు అందజేసింది అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు మాత్రమే అన్నారు. అప్పుడే రెండు లక్షల రూపాయలు బంగారు తల్లి పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది అన్నారు. కానీ ప్రస్తుతం మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టి కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు మాత్రమే మహిళలకు చెల్లించటం దారుణం అన్నారు. పెరిగిన బడ్జెట్ అనుగుణంగా ఏ సంక్షేమ పథకానికి నిధులు పెంచలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తాసిల్దార్ సంగు శ్వేత ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, జెడ్పిటిసి మోదుగు సుధీర్‌బాబు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్ వివిధ గ్రామాల సర్పంచులు కేతినేని ఇందు, బుక్య సైదానాయక్, కొమ్మినేని ఉపేందర్, మర్రి తిరుపతిరావు, భాగం శ్రీనివాసరావు, కొండాపు వేణు, ఎర్రం శెట్టి సుబ్బారావు ఎంపీటీసీలు కందిమల్ల రాధ, ముక్కపాటి అప్పారావు పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు రైతుబంధు మండల కన్వీనర్ వేమూరి ప్రసాదరావు మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.