Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామస్తుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ-పాల్వంచ
అన్ని రకాల హక్కులను కోల్పోతున్న ధరణి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ మండలంలోని పాండురంగపురం గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో ఒక్కరోజు రిలే నిహార దీక్షలను దాసరి రమేష్ నేతృత్వంలో చేపట్టారు. ఈ దీక్షకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. పాండవ పురం గ్రామంలో మేము 70 సంవత్సరాలుగా రెవెన్యూ నందు ఉంటున్నామని, 2018 సంవత్సరం నుండి రికార్డు వ్యవస్థ రద్దు చేయడం వలన అనుభదారుడు కాలం రద్దుచేసి పహాని నగలు ఇవ్వడం లేదని దానివల్ల మేము అన్ని రకాల హక్కులను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి 2018 చట్టంలో సాదా బహినామాకు వీలు లేకుండా పోయిందని, దాని వలన మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు రావడంలేదని కాబట్టి సర్వే చేసి పొజిషన్లో ఉన్న అందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాల మంజూరు చేయాలని కోరారు. ఈ దీక్షకు సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్ మద్దతు తెలిపి ప్రసంగించారు. ధరణి వ్యవస్థ వల్ల అనేకమంది హక్కులను కోల్పోతున్నారని తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్, పాండురంగాపురం రైతులు కోటి, తిరుపతి, డి.శ్రీరాములు, బి.ఉప్పయ్య, కే.లక్ష్మయ్య, భద్రయ్య, కార్తీక్, వీరస్వామి, వెంకటయ్య, కాంతారావు, వెంకట్‌రెడ్డి, సోమిరెడ్డి, జన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.