Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి నుంచి మొదలు కానుంది
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- రేజర్లలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ- సత్తుపల్లి
మార్చి మొదటి వారం నుంచి సొంత స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమ వారం మండలంలోని రేజర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సండ్ర శంకుస్థాపనలు, ప్రారంభోత్స వాలు చేశారు. సింగరేణి సంస్థ ద్వారా రూ. కోటి వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఫంక్షన్‌హాలు పురోగతిని ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం బీసీ, ఎస్సీ కాలనీల్లో సింగరేణి సంస్థ రూ. 18లక్షలతో ఏర్పాటు చేసిన శుద్ధజల తాగునీటి యూనిట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. దీంతో పాటు రూ. 48లక్షలు సింగరేణి నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి, హరిజనవాడలో కమ్యూనిటీహాలుకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో సండ్ర మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలన్నీ దాదాపుగా నెరవేర్చారని, ఇక సొంత స్థలాల్లో డబుల్ ఇండ్ల నిర్మాణాలతో ఇచ్చిన అన్ని వాగ్దానాలన్నీ పూర్తయినట్లేనని సండ్ర స్పష్టం చేశారు. మాలపల్లిలో కూడా త్వరలో కమ్యూనిటీహాలును మంజూరు చేయడం జరుగుతుందని సండ్ర తెలిపారు. తెలంగాణ రాకముందు, వచ్చాక అభివృద్ధిని ప్రజలు భేరీజు వేసుకోవాలన్నారు. ప్రజల సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మనమంతా అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, ఎంపీడీవో సుభాషిణి, బీఆర్ఎస్ నాయకులు దొడ్డా శంకరరావు, భీమిరెడ్డి గోపాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, నంద్యాల వెంకటరెడ్డి, గొర్ల వెంకటరెడ్డి, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి (ఎర్రబాబు), సర్పంచ్ జక్కుల ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యులు విస్సంపల్లి వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సోములు, కంభంపాటి రాంబాబు, పొదిలి సర్వేశ్వరరావు, గుర్రాల సురేశ్, చింటూ, నాగరాజు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.