Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని అంజనాపురం గ్రామంలోని జీకే ఎఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ ప్రధాన కార్యాలయంతో పాటు, కార్బన్ క్రెడిట్ ప్రాజెక్టులో నమోదైన సోంపల్లి గ్రామంలోని రైతుల వ్యవసాయ క్షేత్రాలను ఐరాస పర్యావరణ ఆడిటింగ్ కమిటీ సభ్యులు సోమవారం సందర్శించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ రైతులకు అదనపు ఆదాయంగా కార్బన్ క్రెడిట్ ప్రోత్సాహకాలను అందించే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లో కార్బన్ క్రెడిట్ ప్రాజెక్ట్ మీద పయనీర్ అసోసియేషన్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన జీకేఎఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ సంస్థ పని చేస్తున్నారు. ఈ పర్యటనలో ఆడిటింగ్ బృందం సభ్యులు శీతల్, అపర్ణ కార్బన్ ప్రాజెక్ట్‌కి సంబంధించి నటువంటి సంస్థ పనితీరును పరిశీలించడంతోపాటు, జీకేఎఫ్ సంస్థ రైతులతో పాటు వివిధ రైతు సంఘాలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదేవిధంగా సందేహాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంస్థ పనితీరును, రికార్డుల నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ఆడిటింగ్ బృంద సభ్యులతో పాటు టెక్నికల్ హెడ్ వంశీకృష్ణ, సోంపల్లి రైతులు సతీష్, రమేష్, వెంకన్న, రామిరెడ్డి పాల్గొన్నారు.