Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని ఎదిరించే సత్తా కాంగ్రెస్కు లేదు
- స్థానిక శాసన సభ్యులు మాటలు సరికాదు
నవతెలంగాణ-మణుగూరు
సీపీఐ(ఎం), సీపీఐ వామపక్ష పార్టీలు బీఆర్ఎస్తో కలిసి రాష్ట్రంలో బీజేపీని అడుగు పెట్టనీయబోమని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమ వారం స్థానిక గిరిజన భవనంలో పినపాక నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ దుర్మా ర్గమైన సిద్ధాంతంతో బీజేపీ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలను విభజిస్తూ దేశంలో అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల న్నీటిని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బలి తీసుకుందన్నారు. ఉచితల పేరుతో సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వ రద్దు చేస్తుందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అజ్ఞానంతో మాట్లా డుతున్నారన్నారు. గిరినేతర్లకు కూడా పోడు భూముల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి రబి పంటను ఆదుకోవాలని అన్నారు. దళిత బంధు లబ్ధిదారులను అధికారులచే ఎంపిక చేయాలన్నారు. పినపాక శాసనసభ్యులు మాటలు సరికావన్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. బీఆర్ఎస్ పరస్పర అంగీకారంతోనే పొత్తు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ కాకుంటే సీపీఐ(ఎం), సీపీఐ కలిసే పినపాకలో పోటీ చేస్తామని తెలిపారు. పొత్తుల పేరుతో కమ్యూనిస్టులను నిందించడం సరికాదన్నారు.