Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట పనులు అడ్డగింత
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సీతమ్మసాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణ పనుల్లో భాగంగా భూములు కోల్పోతున్న గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలని పర్ణశాల గ్రామపంచాయితీ సర్పంచ్ తెల్లం వరలకీë, ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సర్పంచ్ తెల్లం వరలకీë, ఉపసర్పంచ్ వాగె ఖాదర్బాబు, ఏఎస్పీ డివిజన్ అద్యక్షులు సోంది మల్లూరు, ఆదివాసిసేన మహిళా నాయకురాలు వాగే రాజేశ్వరి ఆధ్వర్యంలో భాదిత రైతులు సీతానగరం రెవిన్యూ పరిధిలో జరుగుతున్న కరకట్ట నిర్మాణ పనులను వారు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఆదివాసీలకు చెందిన భూములను నష్టపరిహారం చెల్లించకుండా కరకట్ట పనులు ఎలా చేపడతారని వారు ప్రశ్నించారు. ఇట్టి విషయమై అనేకమార్లు రెవిన్యూ అధికారులకు వినతులు ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోవడం లేదన్నారు. రెవిన్యూ అధికారులు ఇప్పటికైనా భూములను పరిశీలించి భాదిత రైతులకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో పనులు ఎట్టి పరిస్థితిలో జరగకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. పనులు అడ్డగించిన వారిలో కోరం మురళి, వెంకటేష్, అల్లేష్, నాగమణి, పొడియం వెంకటరమణ, భూనిర్వాసిత రైతులు పాల్గొన్నారు.