Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం నరేష్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఇటీవల ఐసీసీ నిర్వహించిన అండర్-19 ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్‌పై గెలుపొంది ఇండియా ఉమెన్స్ టీమ్ ఛాంపియన్‌గా నిలిచిన భద్రాద్రి ఆణిముత్యం గొంగడి త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకం అందజేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం నరేష్ అన్నారు. వరల్డ్ కప్ గెలుపొందుటలో ముఖ్య భూమిక పోషించి మంచి ప్రదర్శనతో గెలుపుకు ఎంతో విలువైన 24(29 బంతులలో) పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచి, అండర్-19 ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి ఛాంపియన్‌గా నిలిపిన మన భద్రాద్రి జిల్లా ముద్దుబిడ్డ, దేశం గర్వించదగ్గ ప్రతిభ కనపరిచిన గొంగడి త్రిషను మంగళవారం హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడుపల్లి తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. నరేష్ మాట్లాడుతూ యావత్ దేశమే గర్వించదగ్గ ప్రదర్శన చేయడం చాలా అభినందనీయ విషయం అని కొనియాడారు. త్రిషను అభినం దించిన వారిలో హైకోర్టు న్యాయవాది పెనుబల్లి రమేష్ బాబు పాల్గొన్నారు.