Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారు చిచ్చు నివారణకు చర్యలు
నవతెలంగాణ-మణుగూరు
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని అడవులు, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నట్టు మణుగూరు ఎఫ్డీఓ సయ్యద్ మక్సుద్ మొహియుద్దీన్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెట్లు ఆకులు రాలే కాలంలో మంటలు చెలరేగకుండా అడవుల రక్షణ కోసం ఫైర్ బృందాలను ఏర్పాటు చేస్తున్నావున్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ మోడి ద్వారా ముందుస్తుగా మంటలు చెలరేగా ప్రాంతాలను గుర్తించడంతో పాటు అధికారులను అప్రమత్తం చేసే విధానం అమలులోకి వస్తుందన్నారు. పశువుల కాపరులు, స్థానిక అటవీ సమీప ప్రజలు అడవులను తగులబెట్టకుండా ప్రచార అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారున్నారు. వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు సాసర్ పేట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దెబ్బతిన్న ప్రాంతంలో రాక్ సాల్ట్, పుట్టమట్టితో కలిపిన పదార్ధాలయ చేస్తున్నామన్నారు. సోలార్ మంపు పంపు సెట్ల ద్వారా అటవీ ప్రాంతాల్లో నీటి సంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంటలు విస్తరించకుండా అటవీ ప్రాంతంలో ట్రంచులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు ప్రత్యేక బృందాలకు ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు. మణుగూరు కేంద్రంగా కోటి మూడులక్షలతో తెలంగాణ హరితహారం క్రింద అర్బన్ పార్క్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. పార్క్ రెండు వేల ఎకరాల పరిధిలో ఏర్పాటు చేస్తుండగా 400 హెక్టార్లలో అధునా తనంగా పార్క్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ నగర స్కీం ద్వారా మరిన్ని నిధులు విడుదలైతే అభయారణ్యంలో పక్షులు, జంతువులు సమూహాలను రూపొందించనున్నట్లు తెలిపారు. ఇప్పటి అర్బన్ పార్క్‌లో కొన్ని అటవీ జంతువులు సంచరిస్తున్నాయని వాటికి అవసరమైన ఆహారాన్ని, తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు. 100 శాతం పార్క్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలిపారు.