Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట
- రూ.4 కోట్ల 80 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం
- విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-బూర్గంపాడు
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే రోల్ మోడల్‌గా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ విప్, పిన పాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం మండలంలోని మర్రికుంట గ్రామంలో వేపలగడ్డ వరకు సుమారు రూ.2 కోట్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, నకిరేపేట నుండి ఉప్పుసాక వరకు గోపాలపురం వరకు పనులకు శంకుస్థాపన, ఆర్అండ్బీ రోడ్డు నుండి చెరువు సింగారం వరకు రూ.80 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమాన్ని విస్తృతం చేసి అమలు చేసేదందుకే టీఆర్ఎస్...బీఆర్ఎస్గా మారి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిందని ఆయన అన్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించి అండగా నిలవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అన్ని సాధించి సీఎం కేసీఆర్ గడిచిన 8 ఏళ్ల కాలంలో ప్రజలకు కావలసిన సదుపాయాలు అందించారని ఆయన పేర్కొన్నారు. పినపాక నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్ల సౌక ర్యం, బ్రిడ్జిల నిర్మాణం, చెక్ డాంల నిర్మా ణంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్ర మాలను చేస్తున్నమ న్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పినపాక నియో జకవర్గం అన్ని రంగాల లో అభివృద్ధి పథంలో తీసుకు పోతున్నా మన్నారు. కేసీఆర్ నేతృత్వంలో అడిగిన వెంటనే కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్నా రని ఆయన పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామి రెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పోడియం ముత్యాలమ్మ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్, ఇరివెండి మాజీ ఎంపీ టీసీ వంశీకృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి, కామిరెడ్డి రామకొండా రెడ్డి, లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.