Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వెంచర్ల ఏర్పాటు
- ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా....సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
- 1/70 చట్టం ఉన్నప్పటికీ....మితిమీరి పోతున్న రియల్ మాఫియా
నవతెలంగాణ-కొత్తగూడెం
రెవెన్యూ అధికారులు అనుకూలంగా ఉంటే చాలు ఎలాంటి భూమినైనా తమ సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ భూములైతే ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించవచ్చు. 1/70 లాంటి చట్టాలు ఉన్నప్పటికీ ఎలాంటి అడ్డులేకుండానే చెరువు భూములను సైతం మార్పుచేసుకుని రియల్ మాఫియా చేయవచ్చు. ఇదంతా కొత్తగూడెం పట్టణానికి కూత వేటు దూరంలోఉన్న చుంచుపల్లి ఏజన్సీపరిధిలో విచ్చల విడిగా సాగుతున్న రియల్ మాఫియా.
చుంచుపల్లి మండలం, రామాంజనేయ కాలనీ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచరు వేసి అక్రమ భూ దందాకు కొందరూ గిరిజనేతరులు పాల్పడుతున్నారు. అమయాక గిరిజనుల అడ్డుపెట్టకుని రియల్ మాఫియాకు తెరలేపారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ముఖ్యగా రెవిన్యూ అధికారులు రియల్ మాఫియాకు కొమ్ము కాస్తున్నారని, దీన్ని అదునుగా భావించి గిరిజన భూములకు సమీపంతో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించేస్తున్నారనే ఆరోపనలు ఉన్నాయి. రామాంజనేయ కాలనీ పంచాయతీ పరిధిలో సర్వే నెం.137/3ఆ/1/1 లో 1 ఏకరం, 11 కుంటల భూమి, సర్వే నెం.137/3ఆ/2 ఒక ఏకరం 35 కుంటల భూమి ఉండగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని, చెరువును సైతం కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగుల, రెవెన్యూ అధికారుల అండదండలతో కబ్జాలకు పాల్పడ్డారు. ఏజెన్సీ నిబంధనలకు వ్యతిరేకంగా, పంచాయతీ చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ పద్ధతిలో అనుమతి లేకుండానే వెంచర్ వేశారు. 80 ఏండ్లుగా గొలుసుల మల్లయ్య పేరుతో ఉన్న 5 ఎకరాల చెరువును రాత్రికి రాత్రే మాయం చేసి, రియల్ ఎస్టేట్‌గా మార్చారు. చెరువు విషయంలో కలెక్టర్ అనుమతులు ఇవ్వలేదని సమాచారం. పలువురు రామాంజనేయ కాలనీ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమాలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. స్పందించిన కలెక్టర్ రెవిన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీఓలు సదరు ప్రాంతాన్ని సందర్శించారు. ఇది ప్రభుత్వ భూమిగా తేల్చారు. ఈ భూమిలో ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయరాదని, ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేశారు. రెచ్చిపోయిన రియల్ మాఫియా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసి ప్లెక్సీలు రాత్రికి రాత్రే తొలగించారు. దీన్ని పలు రాజకీయ పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. భూ కబ్జా అక్రమార్కులు రెచ్చిపొతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే సమా న్యుల భూములకు రక్షణ ఉండదని, ఫ్లెక్సీలను తొలగి ంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రెవిన్యూ డివిజనల్ అధికారులు పంచా యతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రియల్ మాఫియా వారు తొలగించిన ప్పటికీ పంచ ాయతీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహ రించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే అధికారులు తూతు మంత్రంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపిస్తున్నారు. కలెక్టర్ తక్షణమే స్పందించి ఫ్లెక్సీలు తొలగించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా భూ బదలాయింపు
కొత్తగూడెం రెవిన్యూ అధికారి (ఆర్డీఓ) ఏజెన్సీ ప్రాంతంలో నిబం ధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా భూ బదలాయింపు చేశారు. అక్రమంగా భూ బదలాయింపు చేసిన కొత్తగూడెం ఆర్డీవో పై విచారణ జరిపించాలి. చుంచుపల్లి మండలంలో సర్వే నెంబర్ 158/1ఆ నుండి 159/6అ/2 వరకు 6 ఎకరాల 20 కుంటల భూమితో పాటు, మరో ఆరున్నర ఎకరాల భూమిని చట్ట విరుద్దంగా గిరిజనేతరులకు భూ బదలాయింపు చేశారు. రెవిన్యూ అధికారుల అండదండలతోనే అక్రమ భూ బదలాయింపు, భూమిలో ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా, పంచాయతీ రాజ్ చట్టాలకు వ్యతిరేకంగా వెంచర్లు వేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల్లో సైతం నిబంధనలకు విరుద్ధంగా ఆర్డీఓ అక్రమ పద్దతితో భూ బదలాయింపు చేశారు, వీటిపై కమిటీ వేసి విచారణ జరిపించాలి.
- : కామేష్ బీఎప్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి