Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
చుంచుపల్లి మండంలోని ప్రతి గ్రామంలో రానున్న వేసవి దృష్ట్యా తాగు నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, నీటి వసతి కోసం సంబంధిత అధికారులు నివేదికలు అందజేయాలని చుంచుపల్లి మండల అధ్యక్షురాలు బాదవత్ శాంతి అన్నారు. మంగళవారం ఎంపిపి కార్యాయలంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడారు. చుంచుపల్లి మండల పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. నీటి వసతి కొరకు ఎస్టిమేషన్స్ ఏఈలు త్వరితగతిన అందజేయాలన్నారు. మండలంలో అర్హులైన పోడు రైతులకు పోడు భూముల కొరకు పట్టా పాస్ పుస్తకాలు కూడా సిద్ధమయ్యాయని చుంచుపల్లి తహసిల్దార్ కృష్ణప్రసాద్ ప్రకటించారు. సీఎం చేతులమీదుగా త్వరలో పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఎంపీడీవో సకినాల రమేష్, ఉపాధ్యక్షులు వట్టికొండ మల్లికార్జునరావు, చుంచుపల్లి తహసిల్దార్ కృష్ణ ప్రసాద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.