Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
నేటి యువత భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ములకపాడు యలమంచి సీతారామయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ రెడ్ బుక్ డే కార్యక్రమంలో కారం పుల్లయ్య పాల్గొని మాట్లాడుతూ... ఫిబ్రవరి 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ రెడ్ బుక్ డే కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల్లోనూ విప్లవకారులు, సోషలిస్టుల అగ్రశ్రేణికి చెందిన వారి జాబితాలో భగత్ సింగ్ ఒకరు అన్నారు. మన దేశంలో మొట్టమొదటి మార్క్సిస్ట్ సిద్ధాంత ఆలోచనపరులలో కూడా భగత్ సింగ్ ఒకరిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భగత్ సింగ్ స్ఫూర్తితో భవిష్యత్తులో ఈ దేశంలో మతం మత్తుతో డ్యూటీ చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీని మన రాష్ట్రం నుండే కాదు దేశం నుండి కూడా తరిమి కొట్టాలని ఆయన ఈ రెడ్ బుక్ డే సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు కొరసా చిలకమ్మ, జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు మహమ్మద్ బేగ్, పాయం రాంబాబు, వర్ష చిన్నారావు, కాకా కృష్ణ, మహేంద్ర నాథ్, గట్టుపల్లి వెంకటేశ్వర్లు, ముర్రం వెంకటేష్, ముద్దరాజు తదితరులు పాల్గొన్నారు.