Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం టీఎస్పిఈ జేఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న దశల వారి ఆందోళనలో భాగంగా బీటీపీఎస్‌లో సమావేశం నిర్వహించారన్నారు. ఈ సందర్బంగా బిటిపిఎస్ సిఈ బిచ్చన్నకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పిఆర్సిని వెంటనే ప్రకటించాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పదకొండు నెలలు జాప్యమవుతున్న యాజమాన్యం పిఆర్సిని ప్రకటించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే దశల వారి ఆందోళనలకు వెళ్తున్నారని ఆరోపించారు. ఆందోళన కార్యక్రమాలు వచ్చే నెల 24 వరకు కొనసాగుతాయన్నారు. ఈ నెల 24, 25, 27, 28 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతారన్నారు. వచ్చేనెల ఒకటి నుంచి నాలుగు వరకు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కర్మాగారంలో ధర్నాలు ఉంటాయని వివరించారు. వచ్చేనెల 8 నుంచి 23 వరకు రిలే నిరాహార దీక్షలు అనంతర 24న హైదరాబాదులో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ బీటీపీఎస్ రీజియన్ చైర్మన్ వి.ప్రసాద్, పవర్ ఇంజనీర్ అసోసియేషన్ అధ్యక్షులు రవి ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసి యేషన్ అధ్యక్షులు రవితేజ, ఇంజనీర్ అసోసియేషన్ నాయకులు రాజబాబు, కార్మిక సంఘం 1104 అధ్యక్షుడు హేమ్లా నాయక్, వీరస్వామి, బీసీ సంఘం అధ్యక్షులు శ్రావణ్ కుమార్, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.