Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఏ రసూల్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లాడి పాపరాజు మృతి బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి తీరని లోటు అని బీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు ఎస్ఏ రసూల్ అన్నారు. అనారోగ్యంతో గత కొంత కాలంగా చికిత్స పొందుతూ మృతి చెందిన అల్లాడి పారాజు పార్దివ మృత దేహాన్ని ఆయన మంగళవారం సందర్శించి నివాళులు అర్పించడంతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. పాపారాజు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాడని ఏనాడు పదవులను ఆశించలేదన్నారు. నివాళులు అర్పించిన వారిలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు పూదోట సూరిబాబు, జెడ్పీటీసి తెల్లం సీతమ్మ, ఎండి హలీంఖాన్, సీనియర్ నాయకులు కొత్తూరి సీతారామారావు, మట్టా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అద్యక్షులు తోటమళ్ల సుధాకర్, మండల కార్యదర్శి రాముడు, యండి జానీపాషా, నాయకులు తదితరులు ఉన్నారు.