Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
మండలంలోని చండ్రుగొండ గ్రామపంచాయతీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంఆర్ఐ ఈజీఎస్ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణం కోసం మంజూరైన రూ.45 లక్షల నిధులకు గాను 10 సీసీ రోడ్ల నిర్మాణం ఇష్టారాజ్యంగా ప్రజలకు అవసరం ఉన్నచోట తీర్మానం చేయకుండా, అవసరం లేని చోట, వాళ్లకు నచ్చిన చోట, సీసీ రోడ్ల తీర్మానాన్ని చేయించుకుంటున్నారని, పాలకవర్గ సమావేశంలో వార్డు సభ్యులు మాట్లాడితే నీకేం సంబంధం, నీ డబ్బులు ఏమైనా ఖర్చు పెడుతున్నారా అంతా మా ఇష్టం అధికార పక్షం నాయకులు అంటున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. వార్డు పంచాయతీ నిధులపై సమగ్ర విచారణ జరపాలని, ప్రజలకు అవసరమైనచోట్ల సీసీ రోడ్ల నిర్మాణం చేయాలని, ఎంపీడీవోకు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు నీలవర్ణ, స్వర్గం నాగభూషణం, నల్గొండ నాగులు, వరికుటి విజయ కుమారి ఫిర్యాదు చేశారు.