Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత ఎమ్మెల్యే మరణిస్తే ప్రభుత్వ లాంఛనాలు వర్తించవా...?
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
బహుజనుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి గర్హనీయమని, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దళిత ఎమ్మెల్యే సాయన్న మరణిస్తే ప్రభుత్వ లాంఛనాలు వర్తించవా అని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించనందుకు నిరసనగా మంగళవారం పోస్ట్ ఆఫీసు అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం దళితుడు అనే ఓకే ఒక కారణంతో అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయలేదని దుమ్మెత్తిపోశారు. ఆంద్ర వాళ్ళు, సినిమా రంగం వాళ్ళు చనిపోతే అధికార లాంఛనాలతో చేసే ముఖ్యమంత్రి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సాయి, మాలోత్ వీరు నాయక్, చెనిగారపు నిరంజన్ కుమార్, బొక్క శేఖర్, సరోజ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్ఞాని సాయన్న అనారోగ్య కారణాలతో మృతి చెందారని, అత్యంత ప్రజాదరణ కలిగిన బహుజన ఎమ్మెల్యే జ్ఞాని సాయన్న గౌరవంగా జరగాల్సిన అంత్యక్రియల్లో రాష్ట్ర ప్రభుత్వం వివక్షత ప్రదర్శించిందని బీఎస్పీ జిల్లా కార్యదర్శి కె.వి.రమణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కోశాధికారి గాడిద ధామోదరరావు, మహాళా నాయకురాలు కేసుపాక సాధన, బివియఫ్ నాయకులు శ్రీనివాసులు, లక్మయ్య తదితరులు పాల్గొన్నారు.