Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన తాళ్ళూరి ట్రస్టు క్రికెట్ టోర్నమెంట్
- బహుమతులు అందజేసిన రేగా
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని ఇరవెండి గ్రామంలో తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళ్ళూరి భారతి జ్ఞాపకార్ధంగా ఈనెల 9వ తేదీ నుంచి నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టోర్నమెంట్లో విజేతగా వారందరికీ నగదుతో పాటు బహుమతులు ప్రధానం చేశారు. మొదటి బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15వేలను క్రీడలలో గెలుపొందిన వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తున్నదన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. యువత పెడదారి పడకుండా క్రీడలలో పాల్గొన వలన మానసిక ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు క్రీడాకారుల పండగ నిలవాలని ప్రతి భను గుర్తించి ప్రోత్సహించాలని ఆయన కోరారు.
మానసికొల్లాసాన్ని క్రీడలు దోహదం : తాళ్ళూరి పంచాక్షరయ్య
క్రీడలు మానసికొల్లాసానికి దోహదపడతాయని తాళ్ళూరి ట్రస్ట్ చైర్మన్ తాళ్ళూరి పంచాక్షరయ్య అన్నారు. ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు. క్రీడల ద్వారా మంచి స్నేహ సంబంధాలు మెరుగు పడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, బిఆర్ఎస్ పార్టీ యువజన మండల అధ్యక్షులు గోనెల నాని, ఇరవెండి గ్రామ సర్పంచ్ లక్ష్మి, పార్టీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.