Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడీపీఓ నిర్మల జ్యోతి
నవతెలంగాణ-చండ్రుగొండ
తల్లిదండ్రులు లేని పిల్లలను పెంచలేని పక్షంలో శిశు విహార్‌కు పంపించాలని ఐసీడీఎస్ సీడీపీఓ సిహెచ్ నిర్మల జ్యోతి సూచించారు. మంగళవారం మండలంలోని మద్దుకూరు గ్రామ శివారులోని మంగళ బోడులో గుత్తి కోయలు నివసించే గ్రామాన్ని ఆమె ఆరోగ్యశాఖ సిబ్బందితో సందర్శించారు. గర్భిణీలను, బాలింతలను, యుక్త వయస్సు బాలికలను అందరికీ పౌషిక హారం ఆవశ్యకతను వివరించారు. పసిపిల్లలకు తల్లిపాలు రెండేండ్ల పాటు కచ్చితంగా ఇచ్చే విధంగా తల్లులకు అవగాహన కల్పించారు. అంతే కాకుండా బాలికలకు చదువుకోవలసిన ఆవశ్యకతను తల్లిదండ్రులకు వివరించారు. తండ్రి లేని పిల్లలు, తల్లి మరణించిన పిల్లల గృహాలను సందర్శించి వారి బాగోగులపై ఆరా తీశారు. పెంచలేని పక్షంలో శిశువివార్కు తరలించినట్లయితే ప్రభుత్వం ఆ పిల్లలను పెంచి చదువు కూడా చెప్పిస్తుందని సూచనలు చేశారు. అనారోగ్యంతో బలహీనంగా ఉన్న శిశువును గృహాన్ని దర్శించి పిల్లలకు దుస్తులు, పండ్లు గుడ్లు, పాలు అందజేశారు. ఐసీడీఎస్ సిబ్బంది అక్కడున్న గర్భిణీలు, బాలింతలు పిల్లలకు పాలు బియ్యం, నూనె, పప్పు మొదలైనవి వాటిని పంపిణీ చేశారు. వైద్య సిబ్బంది ఆరోగ్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం టీ.సుశీల, అంగన్వాడి టీచర్, జి.శోభారాణి, పి.అనిత, రమ తదితరులు పాల్గొన్నారు.