Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుష్కర పట్టాభిషేక ఏర్పాట్లు చేయాలి
- 25 లోపు అన్ని పూర్తి చేయాలి
- మార్చి నుండి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచాలి
- శ్రీరామనవమి పట్టాభిషేక మహోత్స నిర్వహణపై కలెక్టర్ సమన్వయ సమావేశం
నవతెలంగాణ-పాల్వంచ
మార్చి 30 శ్రీరామనవమి 31న పుష్కర పట్టాభిషేకం మహౌత్సవాలకు ప్రతి భక్తుడు స్వామి వారి కల్యాణ వేడుకలు వీక్షించేలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశా కార్యాలయంలో శ్రీరామనవమి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహౌత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం భక్తులు మన్ననలు పొందే విధంగా ఘనంగా నిర్వహించుకున్నామని, ఈ సంవత్సరం అదే స్ఫూర్తితో దిగ్విజయంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేద్దామని చెప్పారు. మార్చిలో స్వామివారి వేడుకలు నిర్వహించనున్న మిథిలా స్టేడియంలో సెక్టార్ ప్రణాళిక తయారు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. వేడుకలు నిర్వాహనకు కార్యశరణ తయారు చేయడంతో పాటు పర్యవేక్షణ అత్యంత ముఖ్యమని చెప్పారు. కేటాయించిన విధుల ప్రకారం అధికారులు కసరత్తు ప్రారంభించారని చెప్పారు. మార్చ్ 25వ తేదీ వరకు అన్ని ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. మార్చి 1వ తేదీ నుండి భక్తులు టికెట్లు కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. భక్తులు టికెట్లు కొనుగోలు చేసేందుకు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోస్టల్ మీసేవ కార్గో సర్వీస్ల ద్వారా భక్తులకు స్వామివారి తలంబ్రాలు ప్రసాదాలు చేపట్టాలని తెలిపారు. తలంబ్రాలు ప్రసాదాలు పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణ భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డీపీిఆర్ఓను సూచించారు. మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని పట్నంలోని ప్రధాన కోడలు మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పారు. భక్తులు ఎండ నుండి ఉపశమనం పొందేందుకు మజ్జిగ మంచినీటిని సరఫరా చేయాలన్నారు. ప్రధాన అర్హతల వెంబటి కాలి స్థలాల్లో మొక్కలు నాటేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆర్డీవోకు సూచించారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా భారీ కేడింగ్ ఏర్పాటుతోపాటు గజ ఈతగాలను నాటు పడవలకు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. 24 గంటలు పని చేయు విధంగా అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. అత్యవసర వైద్య సేవ నిర్వాహనకు తరలించేందుకు వీలుగా 108 వాహనాలు అందుబాటులో పెట్టాలని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ప్రాధాన్యంగా జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. విద్యుత్ ఏర్పాట్లను పరిశీలించి ధ్రువీకరణ నివేదిక అందజేయాలని చెప్పారు. మహౌత్సవాల రోజుల్లో మద్యం, మాంసం విక్రయాలను నిలుపుదల చేయాలని చెప్పారు. నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు నిరంతర తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ఎలిప్యాడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రధాన రహదాలకు మరమ్మతులు నిర్వహించాలని ఆర్అండ్బీ జాతీయ రహదారులు అధికారులకు సూచించారు. లాడ్జిలలో అధిక ధరలు వసూలు చేయకుండా ధరలు పట్టిక ఏర్పాటుతోపాటు ఎప్పటికప్పుడు రూములు ఖాళీలు వివరాలను ప్రదర్శింపజేయు విధంగా చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఆర్డీవోకు సూచించారు. అధిక రేట్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తదుపరి నిర్వహించే సమావేశానికి కేటాయించిన విధంగా అధికారులు కార్యచరణ నివేదిక హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.
పర్ణశాలలో ఘనంగా ఏర్పాట్లు చేయాలి
శ్రీరామ నవమి పుష్కర పట్టాభిషేకం మహౌత్సవాలను వీక్షించేందుకు పర్ణశాల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. భద్రాచలంలో చేసిన విధంగానే పర్ణశాలలో ఏర్పాటు చేయాలని ఎక్కడ ఎలాంటి లోడ్పాటు రావద్దని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వాన అధికారి రమాదేవి, డీపీఓ రమాకాంత్, డీఆర్ఓ మధుసూదన్ రాజు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, ఆర్డిఓ వేణు, ఆహారధనకి అధికారి వేణుగోపాల్, ఆర్అండ్బీ ఈ భీమ్లా, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, జాతీయ రహదారుల డీఈ శైలజ, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలు స్వర్ణలత, రత్న కళ్యాణి, దేవస్థానం డి.రవీందర్, ప్రధాని అర్చకులు పొడిచేటి సీతారామానుజ చార్యులు తదితరులు పాల్గొన్నారు.