Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి సేవా సమితి అధ్యక్షులు జక్కం వాణి రమేశ్
నవతెలంగాణ-కొత్తగూడెం
క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర అథ్లెటిక్స్ లో పతకాలు సాధించాలని కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవా సమితి అధ్యక్షులు జక్కం వాణి రమేశ్ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అద్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్ రుద్రంపూర్లో జరిగిన జిల్లా యూత్ అథ్లెటిక్స్ చంపియన్షిప్ను ఆమె జండా ఊపి ప్రారంభించారు .ఈ సందర్బముగా క్రిడాకారులును పరిచేయం చేసుకుని మాట్లడుతూ జిల్లా నలుమూలల నుండి వచ్చిన అథ్లెట్లు ను అభినందించారు. ఈ పోటీలలో మంచి ప్రతిభ ప్రదర్శించాలని భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో మరిన్ని పతకాలు సాధించాలని, జిల్లా పేరును రాష్ట్ర , జాతీయ స్థాయిలో నిలపాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో టిబిజికె యూనియన్ ఏరియా వైస్ ప్రెశిడెంట్ ఎండీ.రజాక్, సీనియర్ పర్సనల్ ఆఫిసర్ సుధాకర రావు ,సెక్యూరిటీ ఆఫిసర్ రమణారెడ్డి, జిల్లా ఆథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు గొట్టపు రాధాకృష్ణ,సేవ సమితి వైస్ ప్రెసిడెంట్ ఫాతిమా రజాక్ ,సెక్రటరి భూలక్మి, నాగేందర్, గిరిప్రసాద,కష్ణ, నాగరాజు ,రియాజ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి కె.మహిధర్ పాల్గొన్నారు.