Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేేసిన విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలతో సమానంగా పల్లెలను కూడా అభివృద్ధి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. బుధవారం సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలోని బీటీపీఎస్ నుండి పెంటన్నగూడెం వరకు సుమారు రూ.కోటి 98 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గోన్నారు.
మండలంలో రేగా పర్యటన
నవతెలంగాణ-కరకగూడెం
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతరావు బుధవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. మండలంలోని కల్వల నాగారం నుండి కన్నాయిగూడెం వరకు సుమారు 21 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కౌలూరు గ్రామంలో రాయన్నపేట నుండి ఎల్లాపురం వరకు 2 కోట్ల 34 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రేగుళ్ళ క్రాస్ రోడ్ నుంచి తుమ్మలగూడెం వరకు సుమారు 21 లక్ష రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతరావు మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని అని అన్నారు. రానున్న రోజుల్లో పినపాక నియోజకవర్గ రాష్ట్రంలో అగ్ర స్థానంలో నిలవాలని అన్నారు. దళితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల ఉన్నతాధికారులు, మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, సర్పంచ్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.