Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూఢనమ్మకాలను నమ్మొద్దు : ఏసీపీ
నవతెలంగాణ- కల్లూరు
చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో పాటిబండ్ల శ్రీనివాస్‌రావును హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు ఏసీపీ రామాంజనేయ తెలిపారు. ఈ మేరకు కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ హనుక్ ఎస్ఐపి రఘుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెన్నూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల శివ సొంత పెదనాన్న పాటిబండ్ల శ్రీనువాసరావు చేతబడి చేస్తున్నాడని ఆదివారం వేట కత్తితో నరికి హత్య చేశాడని తెలిపారు. అదే గ్రామానికి చెందిన శివ మేనమామ నూతనపాటి నారాయణరావు ఇంటి పరిస్థితులు బాగా లేకపోవడానికి కారణం చేతబడి చేస్తున్నారని చెప్పి తనకు తెలిసిన పూజారి ఉన్నాడని అతనితో పూజలు చేస్తే అన్నీ తొలగిపోతాయని చెప్పి తల్లాడికి చెందిన పస్తం రంగారావు, దగ్గరికి తీసుకెళ్లాడు. విషయం మొత్తం చెప్పగా మీ ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళే మీ ఇంటి పేరటీ వాళ్లే చేతబడి చేస్తున్నారని నమ్మించాడు. సుమారు ఎనిమిది నెలల క్రితం అర్ధరాత్రి సమయంలో చెన్నూరు వచ్చి పూజలు చేసి తాయత్తులు కట్టి ఇక మీ జోలికి ఎవరూ రారు అని చెప్పి 20 వేలు తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్లీ వాళ్ళ అమ్మ నాన్నకి ఆరోగ్యం బాగా లేకపోవడం.. పాడిగేదె మృతి చెందడం.. ఇంట్లో ఫర్నిచర్ విద్యుత్ షార్ట్‌కట్ తో దగ్ధం కావడం... శివకు పెళ్లి కాకపోవటం ఇవన్నీ మనసులో పెట్టుకొని పథకం ప్రకారం శ్రీనివాసరావు హత్యకు పథకం రచించాడు. పేరువంచ క్రాస్ రోడ్లో శివను అరెస్ట్ చేసి స్కూటర్, కత్తి అతని ధరించిన షర్టు సీజ్ చేశామని వివరించారు. నూతనపాటి నారాయణరావు, పస్తం రంగారావును గృహాల్లోనే అరెస్టు చేసినట్లు తెలిపారు. బుధవారం సత్తుపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు.