Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వేంసూరు
తను పుట్టిన ఊరుతో పాటు మండల అభివృద్ధికి, పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుండి సహాయ సహకారాలు అందించిన నోష్ ల్యాబ్ అధినేత భీమిరెడ్డి సత్య నారాయణరెడ్డి దంపతులను గ్రామస్తులు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు 75 వేల రూపాయలకుపైగా విలువగల కుర్చీలు ,టేబుళ్లు అవసరమైన పరికరాలను అందించడంతోపాటు తను చదువుకున్న వేంసూర్ పాఠశాల అభివృద్ధికి నూతన టెక్నాలజీతో మరుగుదొడ్లు నిర్మాణం, తరగతి గదులకు కరెంటు లైన్లు ఏర్పాటు, పిల్లలకు కుర్చీలు టేబులు, తాగునీటికి పైపులైను ఏర్పాటు, గ్రామంలో దేవాలయం నిర్మాణానికి సుమారు కోటి రూపాయల వరకు వెచ్చించి నిర్మించారు గ్రామంలో ప్రతి వీధికి సిసి రోడ్లు నిర్మాణం రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఎర్రగుంట శ్రీమంతుడు సత్యనారాయణ రెడ్డికి గ్రామస్తులు రుణపడి ఉంటారని గ్రామస్తులు అంజిరెడ్డి, ప్రతాపరెడ్డిలు అన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ చదువు ద్వారానే తాను ఈ స్థితికి వచ్చానని , పాఠశాలలో సౌకర్యాలు ఉన్నప్పుడే ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు అందించగలరనే ఉద్దేశంతోనే ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధికి తోడ్పడటం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సురేష్ ,మండల విద్యాశాఖ అధికారి చల్లంచర్ల వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు ఉప్పల సత్యనారాయణ, కృష్ణకుమారి తదితరులు ఉన్నారు..