Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే సర్వే జరిపించి హద్దులు ఏర్పాటు చేయాలి
- రియల్టర్లకు, రాజకీయ నాయకుల ఆస్తులు ఉన్న ప్రాంతాలకు అభివృద్ధి పనుల..?
- టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ
- జిల్లా కలెక్టర్ అనుదీప్ కు వినతి
నవతెలంగాణ-పాల్వంచ
చింతలచెరువు భూములన్ని ఆక్రమణలు గురయ్యాయని తక్షణమే సర్వే జరిపించి చర్యలు తీసుకొని హద్దులు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్వంచ మున్సిపల్ పరిధిలోని చింతల చెరువు అభివృద్ధి పనులకు ప్రతిపాదన పంపే ముందు చింతలచెరువు ఆక్రమణలపై విచారణ జరిపించాలని కోరారు. కేటీపీఎస్కు సంబంధించి సిఎస్ఆర్ నిధులు కాలుష్య ప్రభావిత ప్రాంతాలలో కాకుండా వేరే పనులకు మళ్లించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆక్రమణలకు లోనైనా చింతల చెరువును ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే జరిపించి, హద్దులు ఏర్పాటు చేసిన తరువాత మాత్రమే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైన ప్రతిపాదించగలరు. ఇటీవల ప్రతికల్లో వస్తున్న ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు ఆహ్లాదానికి ఉపయోగపడాలే తప్ప దాని మీద 50 అడుగుల భారీ రహదారులు నిర్మించి రియల్టర్లకు అనుకూలంగా ప్రతిపాదిస్తున్నారని చెప్పారు. చింతలచెరువు శిఖం భూములు రాజకీయ నాయకుల కంభంద హస్తాలలో ఉండి అక్రమ లేఅవుట్లు గురవుతున్నాయి. ఇలాంటి వాటిని తొలగించి మొత్తం హద్దుల ఏర్పాటు చేసి పాల్వంచ ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించే పార్కులు, థియేటర్లు, వైజ్ఞానిక కేంద్రాలు నిర్మించాలని కోరారు. పాల్వంచ మునిసిపాలటిలో ఇటీవల మంజూరైన నిధులను అత్యంత ప్రాధాన్యత ఉన్న డ్రైనేజి వ్యవస్థకు ఉపయోగించాలని కోరారు. కేటీపీఎస్ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులు కాలుష్య ప్రభావిత ప్రాంతాలలో కాకుండా గతంలో వేరే ప్రాంతాలకు మల్లించడం జరిగిందని అట్టి నిధులను కెటిపిఎస్ కాలుష్య ప్రభావిత ప్రాంతాలలో వినియోగించగలరని అన్నారు. కొంత మంది రియల్టర్లకు రాజకీయ నాయకులు వారి ఆస్తులు ఉన్న ప్రాంతాలకు ఏమాత్రం జనావాసాలు లేని ప్రాంతాలలో గతంలో నిధులను వినియోగించడం జరిగిందన్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా అలాంటి నిధుల దుర్వినియోగ ప్రతిపాదనలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి వాటిని తమరు అరికట్టాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షుడు నుకాల రంగారావు, ఓబిసి పట్టణ అధ్యక్షుడు చారి, సీనియర్ నాయకులు పైడిపల్లి మనోహర రావు, కొండం వెంకన్న గౌడ్, బత్తుల వెంకటేశ్వర రావు, రాము నాయక్, చంద్రగిరి సత్యనారాయణ తదతరులు పాల్గొన్నారు.