Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లెందు
మండలంలోని రాజీవ్ నగర్ తండాలో గుడిసె వాసుల ఫారెస్ట్ సర్వే ఆపాలని డిమాండ్ చేస్తూ ఫారెస్ట్ డీఎఫ్ఓ ఆఫీసు వరకు సీపీఎం అధ్వర్యంలో ప్రదర్శనగా వెళ్లి, ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సూపరెంటెండెంట్ స్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మండల కార్యదర్శి అబ్దుల్ నబీ అబ్దుల్ పాల్గొని మాట్లాడుతూ సర్వేలు ఆపాలని డిమాండ్ చేశారు. సీఎస్పి బస్తీ పంచాయితీ రాజీవ్ నగర్ శివారు ప్రాంతంలో గత మూడేళ్లుగా ఇళ్ళు వేసుకుని నివాసముంటున్న గుడిసె వాసుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, అందులో భాగంగా మొదట కరెంటు వారిని పంపి, కరెంటు తొలగించారు. తాగు నీరు ఇవ్వడం లేదు. సింగరేణి అధికారులను ఉసిగొల్పి సర్వేచేయించారని అన్నారు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులతో సర్వే చేయిస్తున్నారు. 2011లో అప్పటి ఎమ్మార్వో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు ఇచ్చారు.ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని, అక్కడ మార్కెట్ కమిటీ కోల్డ్ స్టోరేజ్, మున్సిపల్ అర్బర్ పార్కు ఏర్పాటుకు ఈ భూమిని కేటాయించామని గత మూడేళ్లుగా ఇళ్ళు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇళ్ల లేకుండా చేయాలని చూస్తున్నారని నిన్న తహశీల్దార్, ఫారెస్ట్ రేంజర్ని వారి సిబ్బందిని తెచ్చి సర్వే చేయించారు. సర్వేలు ఆపి గుడిసె వాసులకు త్రాగునీరు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ ఇవ్వాలని వినతి పత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, దారావత్ రాందాస్, వైకుంఠం, వెంకన్న, సుధాకర్ పాషా, వీరస్వామి, శంకర్, విజయ, సరిత, లక్ష్మీ, రజియా, ఖైరున్, కౌసల్య, అమ్మి, గొబ్రియ, రాజు ప్రమీల, పద్మ, తదితరులు పాల్గొన్నారు.