Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటలు అందుబాటులోకి రక్షిత మంచినీరు
నవతెలంగాణ -బూర్గంపాడు
మండలంలోని ఇరవెండి గ్రామంలో వోల్వో ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రక్షిత మంచినీటి పథకాన్ని అధికారులు బుధవారం ప్రారంభించారు. సుమారు రూ.7 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ పథకం ద్వారా గ్రామస్తులకు 24 గంటలూ మంచినీరు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వోల్వో గ్రూపు సీఎస్సార్ పథకంలో భాగంగా మంచినీటి పథకాన్ని నిర్మించినట్లు ఓల్వో సంస్థ డైరెక్టర్ జీవీ రావు తెలిపారు. సారపాకలోని ఐటీసీ సంస్థ సౌజన్యంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థలదాత తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు చైర్మన్ తాళ్ళూరి పంచాక్షరయ్యను అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య, వోల్వో సంస్థ ఉన్నతాధికారులు సుమంత్ కుమార్, వెల్లంకి కృష్ణ కిషోర్, సీహెచ్ గణేశ్, ఐటీసీ యూనిట్ హెడ్ సిద్ధార్థ మొహంతి, హెచ్ఆర్ హెడ్ శ్యామ్ కిరణ్, బూర్గం పాడు సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివా సరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వల్లూరిపల్లి వంశీకష్ణ, బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, ఐటిసి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కనకమేడల హరి ప్రసాద్, ఇరవెండి సర్పంచ్ కోర్సా లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఆర్. దివ్య, తాళ్ళూరి రాధాకృష్ణ, మాడపాటి ప్రకాష్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.