Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విప్ రేగా
నవతెలంగాణ-పినపాక
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నార న్నారని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. పినపాక మండలంలోని సీతారాం పురం గ్రామపం చాయతీ పరిధిలోని బీటీపీఎస్ నుండి పెంటన్నగూడెం వరకు సుమారు కోటి 98 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు. పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, స్థానిక సర్పంచ్ మహేష్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము, సర్పంచుల సంఘం అధ్యక్షులు నరసింహారావు, ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు నాగభూషణం, రైతు సమన్వయ సంఘం అధ్యక్షులు దొడ్డ శ్రీనువాస రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసు బాబు, ముక్కు వెంకట నరసారెడ్డి, ఎంపీటీసీలు శేఖర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.