Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భద్రాచలం
అండర్ 19 మహిళ ప్రపంచ కప్‌లో అద్భుత ప్రతిభను కనబరిచి ప్రపంచ కప్‌ను ఇండియా అండర్ 19 టీం గెలవడంలో కీలక భూమిక పోషించిన గొంగడి త్రిషను భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య హైదరాబాదులోని వారి నివాసంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వీరయ్య మాట్లాడుతూ ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని తన బిడ్డని ఈ స్థాయికి తీసుకువచ్చిన తన తండ్రి రామిరెడ్డిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉందని, సాధారణంగా ఆడపిల్ల పుడితే డాక్టర్, ఇంజనీరింగ్ చదివించి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించేస్తారని, కానీ రామిరెడ్డి మాత్రం తన బిడ్డను ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారునిగా తీర్చిదిద్దటం భద్రాచలం ప్రాంతవాసులు నిజంగా గర్వించదగ్గ విషయమని, అలాగే త్రిష కూడా తన తండ్రి కలలను ఎక్కడ ఓమ్ము చేయకుండా కష్టపడి ఈ స్థాయికి చేరుకోవటం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిన మట్టిలో మాణిక్యం అని, త్రిష ఇదే కృషి, పట్టుదలతో మహిళా సీనియర్ టీంకి ఆడాలని కోరుకుంటున్నానని అన్నారు. త్రిషకు తగిన గుర్తింపు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, భద్రాచల హౌటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, తెల్లం నరేష్, బుర లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.