Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలో కర్ర ట్రాక్టర్లు, జామాయిల్ కర్ర ట్రాక్టర్లపై అధిక టన్నులు కర్ర వేయటం డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతున్నారని సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. కోయగూడెం పంచాయతీ పరిధిలో సున్నం నాగే శ్వరరావు ట్రాక్టర్ డ్రైవర్ చింతూరు మండలంలో ప్రమాదంలో చనిపోయారు. ఈమేరకు నాగేశ్వ రరావు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అప్పటికే ట్రాక్టర్ డ్రైవర్లు 20 మంది వరకు యాక్సిడెంట్లో చనిపోయారని ఆయన అన్నారు. ఇన్సూరెన్స్ కొన్ని వాహనాలకు లేక పోవడంవల్ల ఆయా కుటుంబానికి ఆర్థికంగా సాయం అందట్లేదని ఆయన పేర్కొన్నారు. అధిక లోడుతో వెళుతున్న కర్ర వాహనాలకు, జామాయిలు ట్రాక్టర్లకు జరిమానాలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు.