Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు కౌన్సిలర్ల వినతి
నవతెలంగాణ-వైరా
వైరా మునిసిపల్ చైర్మన్ జైపాల్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని మునిసిపల్ కౌన్సిలర్లు బుదవారం జిల్లా కలెక్టర్ వి పి గౌతంకు వినతి పత్రం అందజేశారు. అధికార వాహనాలకు బదులు ప్రవేట్ వాహనాలకు డీజిల్ కొట్టించి అవినీతికి పాల్పడుతున్నట్లు, కౌన్సిల్ తీర్మానం లేకుండానే బిల్లులు చెల్లించి తర్వాత కౌన్సిల్ ఆమోదం కోసం పెడుతున్నట్లు వినతిలో పేర్కొన్నారు. ఒకటో వార్డులో చైర్మన్‌కు గల 360 గజాల స్థలంలో మునిసిపల్ అనుమతులు లేకుండా ఇల్లు కడుతూ మునిసిపల్ ఆదాయానికి గండి కొడుతున్నట్లు, మునిసిపాలిటీ పరిధిలో స్పెషల్ డ్రైవ్ సందర్భంగా తనకు అనుకూల మైన ఏజన్సీ ద్వారా 16 మంది డ్రైవర్లను, 33 మంది శానిటేషన్ వర్కర్లను నియమించి ఒక్కొక్కరి నుండి 50 వేల నుండి లక్ష రూపాయలు వసూలు చేసుకుని అవినీతికి పాల్పడినట్లు పేర్కొన్నారు. మునిసిపాలిటీలో జిఓ ఎంఎస్ నెంబర్ 14 ద్వారా ముగ్గురిని ఎలాంటి అనుమతులు లేకుండా నియమించి వారి నుండి 3 లక్షల చొప్పున వసూలు చేసి వారికి నెలకు 15 వేల వేతనం చొప్పున నియమించినట్లు తెలిపారు.7, 8 వార్డులలో ఖాళీగా ఉన్న 120 కి పైగా ప్లాట్లకు ఎటువంటి నిర్మాణాలు లేకున్నా, సెల్ఫ్ ఎసెస్మెంట్ జరిపి ఇంటి నెంబర్లను కేటాయించి రిజిస్ట్రేషన్లు జరిపి ఒక్కొక్కరి నుండి 50 వేల నుండి లక్ష రూపాయల వరకు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారని వినతిలో పేర్కొన్నారు. 10 వార్డు సోమవరం గ్రామంలో 1983లో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ వాడకంలో ఉన్నా శిధిలమైనదన్న సాకుతో 12,12,2022న కూల్చి వేసి కౌన్సిల్ తీర్మానం లేకుండా, రెండు కుంటల స్థలాన్ని ప్రక్కనే ఉన్న గొల్లపూడి కృష్ణారావుకు కమిషనర్‌కు కూడా తెలియకుండా కలిపి రెండు లక్షలు తీసుకుని దాని చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుటకు సహకరించారని తెలిపారు. సోమవరం ( వైరా) మేజరు గ్రామ పంచాయతీ విద్యుత్ పరికరాలకు బాకీ పడగా విచారణ జరిపిన అధికారులు 8 లక్షలు చెల్లించాలని కోరగా 23 లక్షలకు చెక్కు చెల్లింపులు చేసి భారీ అవినీతికి పాల్పడినట్లు పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, చల్లగుండ్ల నాగేశ్వరరావు, ఇమ్మడి తిరుపతి రావు, డాక్టర్ కోటయ్య, ధనేకుల వేణు ఉన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.