Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేళ్లలో రూ. 23కోట్లు సీఎంఆర్ఎఫ్
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
ప్రజల ఆరోగ్య సంరక్షణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగానే వైద్య రంగానికి రూ. 10వేల కోట్లు కేటాయించడం .రిగిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 60 మందికి రూ.31.67లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సండ్ర మాట్లాడారు. 2019, జనవరి నుంచి 2023, ఫిబ్రవరి వరకు ఈ నాలుగేండ్ల కాలంలో 4250 మందికి రూ. 23కోట్లు సీఎంఆర్ఎఫ్ అందించడం జరిగిందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గానికి వైద్యరంగానికి రూ. 100కోట్లు కేసీఆర్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. అందులో భాగంగానే సత్తుపల్లిలో రూ. 34కోట్లతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడమే గాక మరికొద్ది నెలల్లో నిర్మాణం పూర్తయి ప్రారంభం కానుందన్నారు. ఇప్పటికే సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి రూ. 60కోట్లు కేసీఆర్, కేటీఆర్ ఇవ్వడం జరిగిందన్నారు. మరో రూ. 30 కోట్లను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారన్నారు. ఒక్క సత్తుపల్లి అభివృద్ధికే రూ. 90కోట్లు తీసుకురావడం మామూలు విషయం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నా యన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, కౌన్సిలర్లు వీరపనేని రాధికాబాబీ, గ్రాండ్ మౌలాలి, మారుతి సూరిబాబు, నాయకులు నరుకుళ్ల శ్రీనివాసరావు, నడ్డి ఆనందరావు, వేములపల్లి మధు, అబ్దుల్లా, కంటె అప్పారావు, కొడిమెల అప్పారావు పాల్గొన్నారు.