Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో యడవల్లి,లక్ష్మీపురం వద్ద ఎన్ఎస్పి మేజర్ కాలువకు ఆనుకొని శిథిలావస్థలో ఉన్న 19 మంగాపురం మేజర్ కెనాల్, లాకర్ బ్రిడ్జిను నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్ బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా కాలువ స్థితిగతులతో పాటు, పక్కనే ఉన్న ఇరిగేషన్ గృహాలను ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలువలో ఉన్న నాచు, చెత్తాచెదారము ఉండటం వల్ల కాల్వ చివర భూములకు నీళ్లు అందటం లేదన్నారు. వేసవికాలంలో నాచు, చెత్తాచెదారంలో తొలగిస్తామన్నారు. రైతులు సాగు చేసిన ప్రస్తుత పంటలకు ఏప్రిల్ 22 వరకు నీళ్లు అందిస్తామన్నారు. ఈఏడాది వానాకాలం సాగులో రైతులు ఆరుతడి పంటలు వేయాలన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఏఈ ఎల్ భగీరథబాబు సిబ్బంది పాల్గొన్నారు.