Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ - ఎర్రుపాలెం
నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక, నిరుద్యోగం, పేదరికం, సామాన్య ప్రజల బతుకులపై మోపుతున్న ఆర్థిక భారాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మామునూరు గ్రామంలో గామాసు జోగయ్య అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పొన్నం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, మహిళ సంఘం తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించాలన్నారు. మార్చి నెల ఒకటో తారీకు నుండి పదో తేదీ వరకు గ్రామాలలో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించాలని, ఏప్రిల్ 5వ తారీఖున బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వం మోపుతున్న భారాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియపరచాలని అన్నారు. ఈ కార్య క్రమంలో మధిర నియోజక వర్గ ఇన్చార్జి చింతల చెరువు కోటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, బొడేపూడి విజ్ఞాన కేంద్రం ఇన్చార్జి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి ది వ్వెల వీరయ్య, గొల్లపూడి కోటేశ్వరరావు, సగుర్తి సంజీ వరావు, నల్లమోతు హనుమంతురావు, దివ్యల వీర ఆంజనేయులు, రామిశెట్టి సురేష్, షేక్ లాల, కూడెల్లి నాగేశ్వరరావు, తాలూరి వెంకటనారాయణ, కుర్ర వెంక ట రామయ్య, షేక్ మోదీన్, వెంకట నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.