Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్
నవతెలంగాణ-చింతకాని
గ్రామీణ క్రీడలు ప్రోత్సహించాలని ఖమ్మం అడిషనల్ డిసిపి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. చింతకాని మండలం నేరడ గ్రామంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీల బహుమతి ప్రదానం కార్యక్రమానికి అడిషనల్ డిసిపి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరడ గ్రామంలో గత 42 సంవత్సరాల నుంచి నేతాజీ యువజన సంఘం వారు క్రీడలు నిర్వహించడం చాలా గొప్పగా భావించాలన్నారు. గతంలో తాను ఇక్కడ పని చేసినప్పుడు గ్రామంలో స్థానిక పరిస్థితులు వల్ల ఆటల పోటీలు నిర్వహించకుండా ఆపాలనుకున్నప్పుడు తాను గ్రామానికి వచ్చి అన్ని రాజకీయ పార్టీలు కూర్చోబెట్టి క్రీడల్ని ఎప్పుడూ నిరంతరం కొనసాగించాలని నేతాజీ యువజన సంఘం వారిని కూడా పిలిచి శివుడి ఆశీస్సులుతో ఎప్పుడూ ఆటలు కొనసాగించాలని కోరాను. ఇప్పటికీ 42 సంవత్సరాలు
క్రమం తప్పకుండా శ్రీరాములు వారి కుమారులు ఈ కార్యక్రమన్ని నిర్వహించడం అభినందనియమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సభాధ్యక్షులు నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపకులు దూసరి శ్రీరాములు, వైరా సీఐ టి.సురేష్, స్థానిక ఎస్సై పొదిల వెంకన్న, నేతాజీ యూత్ అధ్యక్షుడు దూసరి నేతాజీ గ్రామ ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు, పెరిక ప్రభాకర్ షేక్ దస్తగిరి మట్టా రవి, గోగుల ఆది గోగుల వెంకట్రారావు, చిర్రా వెంకట్రావు, మట్టా వెంకట్రారావు, మట్టా సాగర్ గోగుల తిరపతిరావు కాట్రాల మహేష్ బండి వెంకటేశ్వర్లు, బండి విజయ, షేక్ నాగుల, షేక్ సలాం, షేక్ సుల్తాన్, పరికపల్లి శ్రీకాంత్, అన్నపురెడ్డి గురవయ్య అన్నపురెడ్డి పుల్లయ్య మట్టా వినరు మట్టా రాంబాబు మట్టా సందీప్ తదితరులు పాల్గొన్నారు