Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో హార్వెస్ట్ విద్యాసంస్థల యాజ మాన్యం కవలల దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహి ంచారు. ఈ సందర్భంగా హార్వెస్ట్ విద్యా సంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్ మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో సుమారు 40 మంది కవలలు ఉన్నారని, వారంతా ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వారుగా ఉంటారని, తాము పరిశీలించినపుడు ఒకే విధమైన ముఖ కవలికలు కలిగి, అభిరుచులు అలవాట్లు ఒకేరకంగా ఉంటాయని, వీరు ఎక్కువగా ఒకరికొకరు సహకరించుకోవడం, కొంత తెలివిగలవారుగా రాణించడం జరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ ఆర్. పార్వతిరెడ్డి మాట్లాడుతూ కవల పిల్లల్లో ముఖ్యంగా ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉంటారని, ఆలోచనా విధానంలో కూడా చాలా దగ్గర స్వభావాలు కలిగియుంటారని తెలిపారు. కవలల సమక్షంలో కేక్ కట్చేసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
న్యూవిజన్లో కవలల దినోత్సవం
నగరంలోని న్యూవిజన్ పాఠశాలలో కవలల దినోత్సవాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ అబాద్ అలీ తెలిపారు. సృష్టిలో అద్భుత విషయాలు అనేకం దానిలో కవలలుగా జన్మించడం మరో అద్భుతమనీ, దగ్గర పోలికలతో విభిన్న మనస్తత్వాలతో కనిపించే వారిని చూస్తే సహజంగా ఆశ్చర్య చకితులు అవుతామని తెలిపారు. తమ విద్యాసంస్థలో 19 జతల కవలలు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ట్విన్స్ డే సందర్భంగా 19 జతల కవలల సమక్షంలో కేక్ కట్ చేశారు. పాఠశాల విద్యార్థులు , ఉపాధ్యాయులు కవలలకి శుభాకాంక్షలు తెలిపారు. తమ పాఠశాలలో పనిచేసే ఉద్యోగుల్లో 2 జతల కవలలు ఉన్నారని తెలిపారు. అచ్చం ఒకే పోలికతో ఇద్దరు కనుల ముందు తిరుగుతుంటే చూసేవారికి కన్నుల పండుగగా ఉంటుందనీ, కుటుంబంలోని తల్లిదండ్రులకు బంధువులకు, తరగతిలోని తోటి విద్యార్థులకు ఆ అనుభూతి వైవ్యక్తికంగా ఉంటుందని తెలిపారు.