Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గుమ్మడి గాంధీ పిలుపునిచ్చారు. గురువారం పినపాక మండలం గడ్డంపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరంను ఎంపీపీ స్థానిక సర్పంచ్ సునీల్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రతి ఒక్కరికీ కంటి వెలుగుపై అవగాహన కూడా కల్పించామని తెలియజేశారు. కంటి వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి కళ్ళజోళ్ళు, మందులు అందజేస్తు న్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అజార్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.