Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్ రేగాను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా క్షయ నివారణ అధికారి
నవతెలంగాణ-మణుగూరు
టిబి రహిత తెలంగాణను సాధించడమే లక్ష్యమని జిల్లా క్షయనివారణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సూచన మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావును జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి వలన కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్త్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు ఉంటాయన్నారు. క్షయ జబ్బు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా లేదా వూసినా, గాలి ద్వారా వేరే వారికి అంటుకుంటుంది అన్నారు. ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురులో ఒక్కరికి ఈ వ్యాధి సోకుతుంది అన్నారు. ప్రస్తుతం క్షయ నిర్ధారణకు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, పరిశోధనశాలల్లో బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నర న్నారు. దీనికి దాదాపు ఎనిమిది వారాల సమయం పడుతుంది అన్నారు. ఇంతకంటే వేగంగా పనిచేసే పరీక్షలు ఉన్నప్పటికీ అవి అన్ని రకాల క్షయ బ్యాక్టీరియాలను గుర్తించలేవన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణకు ఇకపై వారాల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. కేవలం ఒక్క గంటలో వ్యాధి తాలూకూ బ్యాక్టీరియాను గుర్తించేందుకు డీఎన్ఏ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేసినట్లు బ్రిటన్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హెచ్పీఏ) శాస్తవ్రేత్తలు ప్రకటించారన్నారు. క్షయ వ్యాధికి వ్యతిరేకంగా మా పోరాటంలో రాజకీయ పార్టీలు కార్పొరేట్ పరిశ్రమ సంస్థలు, వ్యక్తులు 2025 టిబిని అంతం చేయాలని అన్నారు. కావున టిబి రహిత తెలంగాణను సాధించాలని లక్ష్యంతో నిశ్చయమిత్రగా నమోదు చేసుకొని పినపాక నియోజకవర్గంలోని 180 మంది బ్యాలెన్స్ టీబి రోగులను పౌష్టిక ఆహారం కోసం దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.