Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడీఈ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న సీఎస్పి బస్తి గ్రామపంచాయతీ రాజీవ్ నగర్ శివారులోని పేదల గుడిసెలకు కరెంటు ఇవ్వాలని ఏడీఈ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. మురికివాడల పథకం కింద కరెంటు సరఫరా చేయాలని, ఇళ్ళకు కరంటు మీటర్లు ఇవ్వాలని స్థానిక సుభాష్ నగర్ కరేంట్ ఆఫీస్లో పార్టీ ఆధ్వర్యంలో గుడిసె వాసులు ఎలక్ట్రిసిటీ ఏడీఈ కోటేశ్వరరావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పార్టీ మండల కార్యదర్శి నబీ మాట్లాడారు. ప్రభుత్వ భూమిలో 2011 నాటి తహసీల్దార్ స్థానిక పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత మూడేళ్లుగా పేదలు ఇల్లు నిర్మించుకొని నివసిస్తుంటే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతిని ధులు ఆ భూమి నుండి గుడిసేవాసుల్ని తొలగించాలని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా గుడిసె వాసులకు కనీస మౌలిక వసతులు కరెంటు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మన్యం మోహన్ రావు పాష, సంతోష, కౌసల్య, వైకుంఠం, వీరభద్రం, వెంకన్న, గోబ్రియా, మల్లయ్య, సుశీల, చిన్నారి, భవాని, విజయ, జ్యోతి, ప్రమీల, కైరున్, హుస్సేన్, అమ్మి, పద్మ, రమాదేవి, సుజాత, మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.