Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్లుజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పూదోట సూరిబాబు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లుతో పాటు మండల కేంద్రంలో ఇంటి స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పూదోట సూరిబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తహశీల్దార్లకు వినతి పత్రాలు అందజేయాలని జిల్లా కమిటీ పిలుపు మేరకు గురువారం డిప్యూటీ తహశీల్దార్ ప్రతాప్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా డీటీ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయం ఉన్నతాధికారుల ధృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు సిహెచ్ మిత్ర, సుమన్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.