Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్ అధికారులకు ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
మట్టి, ఇసుక అక్రమ రవాణా పై కఠినంగా వ్యవహరించాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ మైనింగ్, రెవెన్యూ అధికారులను గురువారం ఆదేశించారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు అట్టి ఆదేశాలపై కదిలిన మైనింగ్, రెవెన్యూ అధికారులు రెండు రోజులుగా జిల్లాలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం మైనింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పాల్వంచ మండల పరిధి, తోగ్గూడెంలోని సతీష్ క్వారీలో అక్రమంగా డ్రిల్లింగ్ చేస్తున్నారనే పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఒక టిప్పర్, ఒక బ్రేకర్, రెండు ప్రొక్లైన్లను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఎడి జరు సింగ్ తెలిపారు. మండల పరిధిలో ఇసుక మట్టి అక్రమ రవాణపై మైనింగ్ రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి 23 లారీలు, 17 ట్రాక్టర్లు, 3 జేసీబీలు పట్టుకొన్నారని చెప్పారు. వీరి నుండి 12 లక్షల 65 వేల జరిమానా వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా అక్రమ దందా నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.