Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
డాక్టర్ జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 26న (ఆదివారం) కేటీపీఎస్ ఉద్యోగులు, కార్మికులకు, ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆర్టిజన్స్ కు పాల్వంచ, కొత్తగూడెం జర్నలిస్ట్‌లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పాల్వంచ కేటీపీఎస్ డి.ఏ.వి స్కూల్ నందు గురువారం ట్రస్ట్ సభ్యులు, యశోద హాస్పిటల్స్ సీనియర్ డీజీఎం వి.ఎస్ రామారావులు వైద్య శిబిరంకు సంభందించిన ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. వైద్య శిబిరంలో ఉచిత కన్సల్టెషన్, మందులు ఇవ్వటంతో పాటు వైద్యనిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో సర్జరీలు కూడా చేపించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ అంజిబాబు, జోగారావు, యశోద హాస్పిటల్ సీనియర్ డీజీఎం వి.ఎస్.రామారావు, వారి సిబ్బంది, (హెచ్-142) యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రామారావు, వెంపటి వెంకటేశ్వర్లు, ఎర్రగడ్డ ప్రసాద్, షేక్ సయ్యద్, రమణయ్య, గోపయ్య, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.