Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని జగ్గారం గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 2 సీసీ రోడ్లకు గురువారం జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ శంకుస్థాపన చేసారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందన్నారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఆదరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, సూదిరెడ్డి గోపిరెడ్డి, సర్పంచ్ సున్నం రాంబాబు, ఉప సర్పంచ్ ఆవుల వెంకన్న, కంసాని సత్యనారాయణ, లంకెల రమేష్, ముత్యాల నరసింహారావు, పిట్టా శ్రీను, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.