Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రమాదేవి
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ సంఖ్య పెంచాలని భద్రాచలం గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రమాదేవి సూచించారు. ఈ మేరకు గురువారం మండల పరిధిలోని మర్కోడు గ్రామం బాలుర ఆశ్రమ పాఠశాలను ఆమె సందర్శించారు. అందులో భాగంగా విద్యార్థుల మార్నింగ్ స్టడీ అవర్స్ విద్యా స్థాయిలను పరిశీలించారు. దాంతో పాటు విద్యార్థుల సాధన పుస్తకాలు, స్టోర్ రూమ్, వంటగది, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అలాగే విద్యార్థుల చదువు పట్ల తగు సూచనలు చేశారు. కొంతమంది విద్యార్థులు క్రీడా నైపుణ్యం, చదువులలో చూపిన ప్రతిభకు గాను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింత బుచ్చి రాములును అభినందించారు. విద్యా స్థాయిని పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏటీడీఓ రూపాదేవి, డిప్యూటీ వార్డెన్ పూనెం రవీందర్, టీచర్లు ప్రసాద్ రావు, నాగేశ్వరరావు, ఎర్రయ్య, రాంబాబు, వసంతరావు, జోగయ్య, వసంతరావు, రాంబాబు, అశోక్, వీరన్న పాల్గొన్నారు.