Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ
నవతెలంగాణ-కొత్తగూడెం
సేవకు చిరునామాగా దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంస్థను నిలబెడతామని జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నూతన అధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ అన్నారు. దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ బివి రాజు సూచనల మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని సింగరేణి చిల్డ్రన్స్ పార్క్ ఆవరణలో భద్రాద్రి జిల్లా దిశా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ప్రజల సమస్యలు మహిళా సమస్యల పరిష్కారానికి దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఏర్పడిందన్నారు. ఇప్పటికే దిశ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. మార్చి 8వ తేదీన జరిగే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 5వ తేదీన జిల్లా కేంద్రంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు కూడా ఇస్తామని వివరించారు. ఈ సమావేశంలో స్టేట్ ప్రెసిడెంట్ కోడెమ్ సీతా కుమారి, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ప్రెసిడెంట్ మద్దెల అన్నపూర్ణ, డిస్టిక్ సెక్రెటరీ మాధవి లత, వైస్ ప్రెసిడెంట్ పూజారి లక్ష్మి, ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్వేతశ్రీ నాయుడు, అశ్వాపురం మండల ప్రెసిడెంట్ స్వర్ణ, అండ్ డిస్టిక్ మెంబర్స్ పాల్గొన్నారు.