Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్ రెడ్డి పై పరువు నష్టం దావా వేస్తాను
- 100 కోట్ల వైట్ మనీ ఆఫర్ ఇచ్చినా లెక్క చేయలేదు
- పాయం డిలీట్ అయిన బ్యాచ్
- విలేకరుల సమావేశంలో విప్, ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-మణుగూరు
పినపాక నియోజకవర్గంలో ఏడు మండలాల్లో రూ.100 కోట్ల నిధులతో 487 అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యయని సుమారు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పినపాక నియోజకవర్గాన్ని ధనిక నియోజకవర్గంగా తీర్చి దిద్దుతున్నానన్నారు. రూ.35 కోట్లలతో పాలిటెక్నిక్ కళాశాల నిర్మిస్తామన్నారు. పాలీసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ మణుగూరులో తొలిసారిగా నిర్వహించబోతున్నామన్నారు. కొత్తగూడెం తర్వాత అత్యంత వేగంగా మణుగూరు అభివృద్ధి చెందుతున్నదన్నారు. మార్చిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహిస్తారన్నారు. అంబేద్కర్ సెంటర్ నుండి బొంబే కాలనీ గాంధీ సెంటర్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయాలు ప్రజా అవసరాల కోసం గుర్తించని వారు రాణించలేరన్నారు. కుర్చీ కోసం నానా తంటాలు పడుతూ లక్ష్యం లేని వారు పినపాక నియో జకవర్గంలో రాజకీయం చేస్తున్నారన్నారు. పాయం వెంకటే శ్వర్లు డిలీట్ అయిన బ్యాచ్ నాయకుడు అన్నారు. రేవంత్ రెడ్డి విఫలమైన నాయకుడు చలామణి అవుతున్నా రన్నారు. నోటుకు ఓటులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. పినపాక నియోజకవర్గంలో సంస్కారం లేనివాడి గా విమర్శలు చేశారన్నారు. టికెట్లు అమ్ముకునే సాంస్కృతి కాంగ్రెస్ పార్టీది అన్నారు. ఆదివాసి నాయకుడిని జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి గంటలో పీకేసిన ఘనత కాంగ్రెస్ అన్నారు. రేవంత్ రెడ్డి అతని బృందంపై లీగల్గా అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తామన్నారు. 2009కి ముందు నియోజకవర్గంలో కాంగ్రెస్ లేదన్నారు. భవిష్య త్తును ఆలోచించుకునే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళాను అన్నారు.
రూ.100 కోట్లు వైట్ మనీ, వంద మంది సెక్యూరిటీ ఆఫర్ చేసిన లెక్క చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నామీద మోపిన ఆరోపణలన్నిటికీ చర్చలకు సిద్ధమని తెలిపారు. నాపై విడుదల చేసిన చార్జ్ సీటుపై నిజాలు తేలితే రాజకీయాల నుండి విరమించుకుంటానని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు పోశం నరసింహారావు, ముత్యం బాబు, కడప అప్పారావు, కురి నాగేశ్వరరావు, కత్తి రాము, యాదగిరి గౌడ్, సంజీవరెడ్డి, పాకాల రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.