Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్యం కోసం క్యూ లైన్లు...
- అధిక రేట్లుతో సామాన్యుడి జేబుకు చిల్లు
- చిధ్రిమవుతున్న కుటుంబాలు
- బెల్ట్ షాపులు లేవు : ఎక్సైజ్ సిఐ రాజశేఖర్
నవతెలంగాణ-ఇల్లందు
పేదలు రేషన్ కోసం షాపుల దగ్గర, కొత్త సినిమాలు విడుదల అయితే ప్రేక్షకులు థియేటర్ల ఎదుట భారీ క్యూలైన్లు ఉండటం చూశాం. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడిక బ్రాండీ షాపు ఎదుట క్యూలైన్లు చూడాల్సి వస్తోంది. పట్టణంలోని సుభాష్ నగర్ ఏరియా నుండి గోవింద్ సెంటర్ వరకు ఉన్న బ్రాండీ షాపుల ఎదుట గత వారం రోజులుగా మద్యం బాటిళ్ల కోసం ఆడ మగ తేడా లేకుండా సంచులు పట్టుకొని క్యూలు కడుతున్నారు. దీంతో పట్టణ ప్రజలు క్యూలైన్ లు చూసి ముక్కున వెలుసుకుంటున్నారు. బ్రాండ్ షాపుల ఎదుట కూడా క్యూలైన్లు వచ్చాయా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మద్యం బాటిల్ల కోసం సిండికేట్ ఆఫీసుకు వచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఆటోలు, టూ వీలర్స్ మీద తీసుకెళ్లేవారు. ఇప్పుడేమో వైన్ షాపుల ఎదుట బహిరంగంగా క్యూలైన్లు కడుతూ మద్యం తీసుకెళ్తున్నారు. ఛీప్ లిక్కర్ మాత్రమే వైన్ షాపుల్లో దొరుకుతుంది. బ్రాండెడ్ మద్యం లేదంటారు. స్టాక్ బోర్డు లిస్ట్ పెట్టరు. ఎక్సైజ్ అధికారులు దాడులు చేయరు. కిరాణాషాపులలో ఒక కేజీ బెల్లం కొనుక్కున్న పట్టుకునే ఎక్సైజ్ శాఖ ఇంత జరుగుతున్న పట్టింపు లేదు. పోలీసు, రెవెన్యూ శాఖలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు సైతం చూస్తూ వెళుతున్నారే తప్ప పట్టించుకోవడం లేదు.
వేళల్లో బెల్ట్ షాపులు : కోటర్కి రూ. 20 నుంచి 40 అదనంగా వసూలు
పట్టణం, మండలంలో బెల్ట్ షాపులకి విచ్చలవిడిగా తయారయ్యాయి. వీధికి నాలుగు, వార్డుకు 50 వరకు బెల్ట్ షాపులున్నాయి. ఛీప్ లిక్కర్ మాత్రమే వైన్ షాపుల్లో దొరుకుతుంది. బ్రాండెడ్ మద్యం లేదంటారు. బ్రాండెడ్ మద్యంతో పాటు చీఫ్లిక్కర్స్ బెల్ట్ షాపుల్లో దొరుకుతుంది. కోటర్కి రూ. 20,30,40 అమ్ముతున్నారు. ఒక్కో బెల్ట్ షాపుకు రెండు వేల వరకు ఆదాయం వస్తోంది. ఇదొక పరిశ్ర మలా ఉపాధిగా మారింది. దీంతో రోజురోజుకు బెల్ట్ షాప్ ల సంఖ్య పెరుగుతోంది. రోజు కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతు న్నాయి. ప్రభుత్వానికి భారీగా ఎక్సైజ్ ఆదాయం వస్తోంది. మద్యం మత్తులోయువత విరాగం సృష్టిస్తున్న అధికారులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాజం మారేది ఎన్నడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చింది మద్యం పాలించడానికేనా అంటున్నారు మేధావులు, ప్రముఖులు.
బెల్ట్ షాపులే లేవు : ఎక్సైజ్ సీఐ రాజశేఖర్
బ్రాండ్ షాపులో ఎదుట మద్యం కోసం క్యూలైన్ల విషయమై ఎక్సైజ్ సీఐ రాజశేఖర్‌ను నవ తెలంగాణ వివరణ కోరగా స్పందించారు. ఒక వ్యక్తి 25 వరకు మద్యం బాటిళ్లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అనుమతి ఉందన్నారు. ప్రభుత్వ విధానమే ప్రభుత్వ పాలసీనే మేము చేసేది ఏమీ లేదన్నారు. బెల్ట్ షాపులు అధికార పూర్వకమా అనధికారికంగా ఏర్పాటు చేశారని తెలపాల్సిందిగా నవతెలంగాణ కోరింది. స్పందిస్తూ బెల్ట్ షాపులు అనే పదాన్నే మేము ఉపయోగించమని అన్నారు. వీధుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.