Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ముగ్ధ' షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన ప్రముఖ సినీనటి హనీరోజ్
నవతెలంగాణ- ఖమ్మం
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శశి వంగపల్లికి చెందిన 'ముగ్ధ' షాపింగ్ మాల్‌ను ప్రముఖ సినీ నటి హనీరోజ్ అట్టహాసంగా ప్రారంభించారు. గురువారం ఖమ్మం నగరంలోని మమతా రోడ్డులో అతివలు మెచ్చేలా ప్రత్యేక పట్టు చీరల షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. నాలుగు రాష్ట్రాల్లో 23 బ్రాంచీలతో విరాజిల్లుతున్న పట్టుచీరల వస్త్ర ప్రపంచం 24వ బ్రాంచ్ ఖమ్మంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ డిజైనర్, యంగ్ అండ్ డైనమిక్ ఎంట్రపెన్యూర్‌గా పేరుగాంచిన శశి వంగపల్లికి చెందిన 'ముగ్ధ' షాపింగ్ మాల్(పట్టు చీరల షోరూం) ఖమ్మం గుమ్మంలో అట్టహాసంగా ప్రారంభం కావడం విశేషం. ఈ సందర్భంగా సినీనటి హనీరోజ్ మాట్లాడుతూ..24వ బ్రాంచ్ ముగ్ధ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, మహిళల మనసు దోచే వస్త్రాలు అత్యంత తక్కువ ధరల్లో లభించడం విశేషమన్నారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా వేలాది రకాల డిజైన్లతో రూపొం దించిన వస్త్రాలు ఖమ్మం ప్రజల ముంగిటకు రావడం సంతోషంగా ఉందన్నారు. షాపింగ్‌మాల్ నిర్వాహకురాలు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శశి వంగపల్లి మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాలలో వ్యాప్తి చెంది 24వ బ్రాంచ్‌ను ఖమ్మంలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, మహిళామణుల అభిరుచులకు అనుగుణంగా ఈ షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. హనీరోజ్‌ని చూసేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలు జన సందోహంగా మారింది. కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పూనుకోలు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల రవి కిరణ్, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.