Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాడెద్దులుగా మారి అరక దున్నిన మహిళలు
- రాష్ట్రంలో సంచలనం కారేపల్లి పోడు పోరాటం
- పోరాటాల దిక్సూచీ గిరిజన సంఘం
- రేపు కారేపల్లిలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా మహాసభ
నవతెలంగాణ-కారేపల్లి
పొట్టకూటి కోసం పోడు చేసుకుంటున్న పేదలపై ప్రభుత్వ నిర్భంధాలు పెరిగాయి. 70 ఏండ్లుగా కూడు పెట్టే పోడు పోతుందని నిస్పృహ ఉన్న దశలో బాధితులకు సీపీఐ(ఎం) ప్రజాసంఘాల అండ లభించింది. చంద్రబాబు నాయుడు సీఎం ఉన్న సమయంలో రీబ్యాక్ పాలసీ పేరుతో పేదల పోడును లాక్కొనే ప్రయత్నం చేసింది. ఆనాడే కారేపల్లి మండలంలో ప్రజాసంఘాలు అడ్డుకొని పోడు పోరాటానికి నాంది పడింది. ఆ సమయంలో 30 మంది పోడు రైతులు, సీపీఐ(ఎం) ప్రజాసంఘాల నాయకులు జైళ్లకు వెళ్లారు. స్వరాష్ట్రం వస్తే పోడు రైతులు బాధలు పోతాయని తలస్తే దానికి విరుద్దంగా హరితహారం పేరుతో నిర్భాంధాలలు తీవ్రతరం చేేసింది. ప్రభుత్వ నిర్భంధాలను ఎదురించే శక్తిని సీపీఐ(ఎం) ప్రజాసంఘాలైన తెలంగాణ గిరిజన సంఘం కల్పించి అండగా నిలిచింది.
కాడేద్దులుగా మారి అరకపట్టిన మహిళలు
పోడుతోనే ముడిపడి ఉన్న పేదల జీవనానికి ప్రభుత్వ ప్రతిబంధకాలు కల్పించింది అయినా పోడు పోతే జీవనమే లేని పేదలు పట్టుదలతో పోడులోనే పోరాటాన్ని సాగించారు. మండల కేంద్రమైన కారేపల్లిలో 2016లో కేసులు నెరవక బాధితులు పోడు కోసం 20 రోజులు పోడులోనే ఉంటూ పోరాటం సాగించారు. అరకలకు కట్టిన ఎద్దులను ఫారెస్టు కార్యాలయంలో నిర్భంధించిన దశలో కాడేద్దులు బదులు మహిళ మెడపై అరక కాని వేసుకోని కారేపల్లి పోడు సాగు చేసిన పోరాట దృశ్యం తెలంగాణ రాష్ట్రానే ఒక ఊపు ఊపింది. సీపీఐ(ఎం) నాయకులు కొండెబోయిన నాగేశ్వరరావు, కే.నరేంద్రలతో పాటు 23 మందిపై కేసు పెట్టినా పోడుదారులు దిగి రాలేదు. ప్రతిపక్ష రాష్ట్ర నేతలు కారేపల్లికి రావటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వాధినేతలే దిగి వచ్చారు. 2016 జాన్ 23న అప్పటి వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్, ట్రైనీ ఐఎఫ్ఎస్, లక్ష్మన్ రంజిత్ నాయక్, ఖమ్మం డీఎఫ్‌వో సురేష్ హెర్మట్, ఇతర ఫారెస్ట్, రెవిన్యూ, ఐటీడీఏ అధికారులు వచ్చి పోడుదారులతో చర్చలు జరిపి పోడు సాగు ఆటంకాలు కల్పించమంటూ హామీ పొందగల్గిగారు. అది గత దృశ్యం... నిత్యం సీపీఐ(ఎం), తెలంగాణ గిరిజన సంఘం మార్గదర్శకంలో పోడుదారులు నిర్భంధాలను ఎదిరిస్తూ సాగు చేసుకుంటున్నారు. సీపీఐ(ఎం) మడమ తిప్పని పోరాట ఫలితమే నేడు పోడు హక్కు కల్పనకు ప్రభుత్వం పూనుకోవటం
హక్కులున్నా ఆంక్షల సాగు...
ఏజన్సీలో పోడుపై అటవీశాఖ ఆరాచకమే సాగించింది... దానికి ఎదురించే సత్తానుతెలంగాణ గిరిజన సంఘం పేదలకు కల్పించింది. హక్కు పత్రాలున్నా పోడులో సాగుపై అటవీ శాఖ అంక్షలు పెట్టి హింసించింది. పోడుభూమి స్వభావంను మార్పు చేయవద్దంటూ పోడు సాగుకు ట్రాక్టర్లను రానీయకుండా అడ్డుకుంది. పంట రక్షణకు బోర్లు, బావులు తవ్వనివ్వలేదు. గిరిజనేతర రైతులను బలవంతంగా స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్లు రాయించుకోవటం కూడా జరిగింది. అటవీ సరిహద్దులు అంటూ పిల్లర్ల నిర్మాణాలు చేయటం, కందకాలు తవ్వటం చేసింది. పోడు హక్కుపత్రాలపై ఐటీడీఏ మంజూరు చేసిన కరెంట్ పోల్స్‌ను సైతం ధ్వంసం చేసి పారెస్టు అధికారులు పేదలలో భయోత్పతం కల్పించింది. విద్యుత్ లైన్ మంజూరు చేసిన ప్రభుత్వ అధికారులపై సైతం కేసుపెట్టే వరకు అటవీశాఖ వెళ్ళిందంటే ఎంత నిర్భాందాలు విధించిందో అర్ధం చేసుకోవచ్చు. చీమలపాడు, పాటిమీదిగుంపు ప్రాంతాల్లో పోడుకు ఇచ్చిన హక్కులను సైతం దూరం చేసే ప్రయత్నం పారెస్టు శాఖ చేసింది. జీపీఎస్ సిస్టమ్‌లో 2005 తర్వాత పోడు చేసినట్లు పచ్చదనం కూడి ఉందంటూ ఇచ్చిన హక్కుల చెల్లవంటూ చాలా మందిని పోడు దూరం చేయటానికి ప్రయత్నం చేసింది. అటవీ చట్టం 1967 సెక్షన్20 సి(7) మరియు 20 డి 3 ప్రకారం పోడు సాగు నేరమని, నోటీసు అందిన 10 రోజుల్లో భూమిని ఖాళీ చేయాలని తాఖీదులు జారీ చేశారు. అటవీ శాఖ ఆరాచకాలపై సీపీఐ(ఎం) ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పేదలు ఎదిరించి పోరాడారు.
పోరాటాల దిక్సూచీ గిరిజన సంఘం
గిరిజనుల ప్రతి సమస్యకు తెలంగాణ గిరిజన సంఘం పోరాటాలు దిక్చూచీగా నిలిచాయి. గిరిజనులు, గిరిజనేతర పేదలను ఏకతాటిపైకి తెచ్చి పోరాటాలు సాగించటంలో గిరిజన సంఘం పాత్ర శ్లాఘనీయం. ఖమ్మం జిల్లాలో పోడుపై తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం నాయకత్వంలో పాదయాత్రలను చేసి పాలకులపై ఒత్తిడి తీసుకవచ్చింది. పారెస్టు అధికారులు చర్యలను ఎప్పటికప్పుడు పోరాటాలతో తిప్పికొట్టి పేదలకు అండగా నిలిచింది. ఏజన్సీలో ఏ పార్టీ నీడలో ఉన్న పేదలైన సమస్య వచ్చిందంటే గిరిజన సంఘం మాకు అండగా ఉందనే భరోసా కల్పించంటంలో తెలంగాణ గిరిజన సంఘం ముఖ్యభూమిక పోషించింది. గిరిజన సంఘం ఖమ్మం జిల్లా 3వ మహాసభ పోరుగడ్డ కారేపల్లిలో ఈనెల 25న జరగనున్నాయి. పోడుపై పాలకుల హామీ, అమలుపై సభలో చర్చించి పేదలకు అన్యాయం జరిగితే తీసుకోవాల్సిన పోరు పంథాను ఈ మహాసభ చర్చించటం జరగనుంది.