Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
వర్కింగ్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, పక్కా ఇండ్లు ఇవ్వాలంటూ శుక్రవారం చండ్రుగొండ రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఎల్.ప్రసన్నను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్ట్‌లు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన విధంగా వర్కింగ్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా ఇండ్ల స్థలాలు, పక్కా ఇండ్లు, ఇవ్వాలన్నారు. కొంతమంది అక్రిడేషన్ సాకుగా చూపించి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. దీనిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు షేక్ జాఫర్, సోమనపల్లి వెంకటేశ్వర్లు, ఎస్డి నూర్ రబ్బాని, డి.లక్ష్మణ్, కే.కృష్ణ ప్రసాద్, రామదాసు, బండి శ్రీకాంత్, బి.వీరభద్రం, గణేష్, పూసం రాంబాబు, సవడం వెంకటేశ్వర్లు, కుక్కుముడి దినేష్, బడికల శ్రావణ్ కుమార్, దయాకర్, వెంకటచారీ, బి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.